IND vs NZ|భారత జట్ట పేలవ ఫామ్‌ని కొనసాగిస్తుంద. హోమ్ గ్రౌండ్‌లో భారత్‌ని న్యూజిలాండ్(New Zealand) గడగడలాడిస్తుంది. బెంగళూరులో భారత్‌పై మంచి విజయం సాధించిన కివీస్ జట్టు ఇప్పుడు రెండో టెస్ట్‌లోను పట్టు బిగిస్తున్నారు. పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 156 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 103 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టిన న్యూజిలాండ్ భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచే విధంగా సాగుతుంది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేయగా, 188 పరుగుల లీడింగ్‌లో ఉంది న్యూజిలాండ్ జట్టు. క్రీజులో లాథమ్(37), రచిన్ రవీంద్ర(7) ఉన్నారు.
ఇక టీమిండియా 16/1 స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించింది. భారత జట్టు 140 పరుగులలోపు చివరి 9 వికెట్లు కోల్పోయింది. స్పిన్ అస్త్రాన్ని నమ్ముకున్న టీమిండియా.. బొక్కబోర్లా పడింది. ప్రత్యర్థి స్పిన్నర్ల ధాటికి విలవిలలాడింది. ఈరోజు మొదటి సెషన్ ఆరంభంలోనే శుభమన్ గిల్ (30: 72 బంతుల్లో 2×4, 1×6)కి లైఫ్ లభించినా.. వృథా చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (30: 60 బంతుల్లో 4×4) ,
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (1: 9 బంతుల్లో) , రిషబ్ పంత్ (18: 19 బంతుల్లో 2×4), సర్ఫరాజ్ ఖాన్ (11), అశ్విన్ (4) అలా ఒక్కొక్కరుగా పెవీలియన్‌కి క్యూ కట్టారు. రవీంద్ర జడేజా అత్యధికంగా 38 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరపున మిచెల్ సాంట్నర్ 7 వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ(Southee) ఖాతాలో ఒక వికెట్ చేరింది.
కాగా, అంతకుముందు గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మనోళ్లు చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా రాణిస్తున్న పిచ్‌పై మనోళ్లు చేతులెత్తేస్తున్నారు. రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లోనే టీమిండియా 6 వికెట్లు కోల్పోవడం గమనర్హం. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (Gil)రెండో వికెట్‌కు నమోదు చేసిన 49 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. ఆ తర్వాత మరే బ్యాటర్ కూడా కనీసం 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. గత రెండు, మూడేళ్లుగా స్పిన్ ఆడటంలో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా గౌతమ్ గంభీర్(Gambhir).. స్పిన్ అస్త్రాన్ని ఎంచుకోవడం ఏందనే విమర్శలు వినిపిస్తున్నాయి.