సాగ‌ర తీరాన ప‌రుగుల ప్ర‌వాహం.. విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడిన నరైన్, పంత్

  • Publish Date - April 4, 2024 / 07:12 AM IST

ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 3న ఢిల్లీ వ‌ర్సెస్ కోల్‌క‌త్తా మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ న‌డిచింది. విశాఖ ప‌ట్నం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ప‌రుగుల ప్ర‌వాహం సాగింది. హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 106 పరుగుల భారీ తేడాతో ఢిల్లీపై ఘ‌న విజ‌యం సాధించింది . ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ సునీల్ న‌రైన అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అతని తుఫాను బ్యాటింగ్ కారణంగా, కోల్‌కతా స్కోరు కేవలం 45 బంతుల్లో 100 ప‌రుగుల మార్క్ దాటింది. న‌రైన ఎదుర్కొన్న మొద‌టి ఐదు బంతుల్లో ఒక్క ప‌రుగు కూడా రాలేదు. కాని ఆ త‌ర్వాత పెన విధ్వంస‌మే సృష్టించాడు.

ఢిల్లీ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. నాలుగో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో నరైన్ 3 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. అంత ఎక్స్‌పీరియ‌న్స్ బౌల‌ర్ అయిన కూడా న‌రైన్ అత‌డిని ఉతికి ఆరేశాడు.ఈ క్ర‌మంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి 10 ఓవర్లలో 135 పరుగులు చేసింది. అయిత‌నే న‌రైన ఊపు చేస్తే అత‌ను సెంచ‌రీ చేస్తాడ‌ని అంద‌రు అనుకున్నారు. కాని మిచెల్ మార్ష్ వేసిన అద్భుతమైన్ బాల్‌కి వెనుదిర‌గ‌క త‌ప్ప‌లేదు. అయితే ఇషాంత్ వేసిన నాలుగో ఓవ‌ర్‌లోనే సునీల్ న‌రైన్ ఔట్‌. అత‌ని బ్యాట్ అంచుకు బాల్ త‌గిలి వెళ్లి పంత్ చేతిలో ప‌డింది. అప్పుడు అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదు. పంత్ రివ్యూ తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా కేకేఆర్ చరిత్రకెక్కింది. న‌రైన్‌కి తోడుగా అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) , ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), రింకూ సింగ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించారు.

ఇక భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రిషభ్ పంత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పంత్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. బౌల‌ర్లకి చుక్క‌లు చూపించాడు. కాని హాఫ్ సెంచరీ చేశాక వెనుదిరిగాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(3/27), వరుణ్ చక్రవర్తీ(3/33) మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. రస్సెల్, నరైన్ తలో వికెట్ తీసారు.

Latest News