T20 WORLD CUP 2024 | భారత్​–ఇంగ్లండ్​ సెమీస్​ మ్యాచ్ కష్టమే…!

భారత, ఇంగ్లండ్​ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్​ మ్యాచ్​ జరిగేట్టు కనిపించడంలేదు. గయానాలో వర్షం రోజంతా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Publish Date - June 27, 2024 / 07:11 PM IST

టి20 ప్రపంచకప్​( T20 CRICKET WORLD CUP 2024) ముగింపు దశకు చేరుకుంది. నేడు జరగాల్సిన రెండు సెమీస్​లో ఒకదాన్లో దక్షిణాఫ్రికా, అఫ్ఘనిస్తాన్​పై విరుచుకుపడి, సునాయాస విజయం(South Africa won over Afghanistan) సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది. ఇక రెండోది, అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్​ భారత్​–ఇంగ్లండ్​( India vs England)ల మధ్య ఈ సాయంత్రం జరగాల్సింది. ఇందులో విజేత, 29వ తేదీన ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడతారు.

ఇప్పుడు ఈ మ్యాచ్​కే వరుణుడు(Rain likely to washout) అడ్డుపడుతున్నాడు. మ్యాచ్​ జరుగనున్న గయానా(Guyana)లో వర్షం పడుతూనేఉంది. అక్కడ ఈ మ్యాచ్​ ఉదయం పూట జరుగుతోంది కాబట్టి, ఈ రోజంతా వర్షం పడే అవకాశం ఉందని గయానా వాతావరణ శాఖ, ప్రపంచ వాతావరణ వెబ్​సైట్​ ఆక్యూవెదర్​.కామ్(Accuweather.com)​ తెలిపింది. సరిగ్గా మ్యాచ్​ మొదలయ్యే సమయానికే వర్షం ఎక్కువవుతుందని వారు చెపుతున్నారు. గంటగంటకి వర్షానికి ఎంత శాతం అవకాశముందో చూడండి.

ఉ. 9 గం. ( సా. 6.30 IST) – 40 %
ఉ. 10 గం. (రా. 7.30 IST) – 66 %
ఉ. 11 గం. ( రా. 8.30 IST) – 75 %
మ. 12 గం. ( రా. 9.30 IST) – 49 %
మ. 1 గం. ( రా. 10.30 IST) – 34 %
మ. 2 గం. ( రా. 11.30 IST) – 34 %
మ. 3 గం. ( అరా. 12.30 IST) – 40 %

వర్షం కారణంగా మ్యాచ్​ రద్దయితే పరిస్థితి:

ఐసీసీ రెండు సెమీఫైనల్​ మ్యాచ్​లకు కలిపి ఒక రోజు రిజర్వ్​ డే(Reserve Day)గా ఉంచింది. ఇండియా–ఇంగ్లండ్​ మ్యాచ్​కు మాత్రం ఉదయం పూట కాబట్టి, మ్యాచ్​ పూర్తయ్యేందుకు దాదాపు 4 గంటల అదనపు సమయం (Extra 250 Minutes) కేటాయించింది. ఫలితం తేలాలంటే మాత్రం ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల(Minimum 10 Overs) ఆటైనా ఆడాల్సిఉంటుంది. ఒకవేళ రెండు జట్లలో ఏ జట్టయినా, 10 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోతే, మ్యాచ్​ రద్దయినట్లు(Match will be abandoned)గా ప్రకటిస్తారు. అలా జరిగితే భారత్​ ఫైనల్​లో ప్రవేశిస్తుంది(India enters Final). ఎందుకంటే గ్రూప్​ స్టేజ్​లో భారత్​ అగ్రస్థానంలో ఉంది కాబట్టి. ఇంగ్లండ్​ ఇంటిముఖం పడుతుంది. నిరుటి విజేత మళ్లీ గెలవాలంటే మ్యాచ్​ జరగాలని ఇంగ్లండ్​ దేవున్ని ప్రార్థించాలి.

Latest News