భారీ యంత్రాలు, ప్రాజెక్టుల నిర్మాణ పరికరాలు, మిషనరీని తరలించేందుకు కొన్నికొన్ని సార్లు ప్రత్యేకంగా భారీ వాహనాలను నిర్మించాల్సి వస్తుంది. భారీ సంఖ్యలో టైర్లు (చక్రాలు) ఉండే వాహనాలను సాధారణంగా భారీ రవాణా వాహనాలు (Heavy Transport Vehicles) లేదా మల్టీ-యాక్సిల్ ట్రక్కులు అంటారు. అలాంటి ట్రక్ ఒకటి వైరల్ గా నిలిచింది.
తాజాగా జుక్కల్ చౌరస్తా మీదుగా 161వ జాతీయ రహదారిపై 160 చక్రాల భారీ వాహనం వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు భారీ విద్యుత్తు యంత్రాన్ని తరలిస్తున్న ఈ వాహనం అక్కడికి చేరడానికి మరో రెండు నెలలు పడుతుందని డ్రైవర్ తెలిపాడు.
గతంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రం మీదుగావరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై సుమారు 150 టైర్లు కలిగిన భారీ లారీ చూపరులను ఆకట్టుకుంది. అప్పట్లో ఆ లారీ మహారాష్ట్ర నుంచి వైజాగ్ కు మిషనరీ యంత్రాలను తరలించేందుకు ఉపయోగించారు. ఇలా పలు సందర్బాల్లో భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలు, యంత్రాలను తరలించేందుకు అరుదుగా భారీ వాహనాలను వినియోగిస్తుండగా..అవి ప్రత్యేక నిర్మాణాలతో చూపరలను ఆకట్టుకోవడం జరుగుతుంది.
