తెలంగాణ క్యాబినెట్లో తీసుకోబోయే నిర్ణయం ఇదేనా

ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ భేటీ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాల వెల్లడికానున్న నేపధ్యంలో ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే అనంతరం తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.

Reported by: Vidhaatha Desk | తెలంగాణ‌ | Dec 02, 2023, 11:26 am IST
Read Time: 1 mins
తెలంగాణ క్యాబినెట్లో తీసుకోబోయే నిర్ణయం ఇదేనా

విధాత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో 4వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మంత్రిమండలికి ఇదే చివరి సమావేశం కానుంది. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.