ACB: ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ అధికారి

యాదగిరిగుట్ట దేవస్థానం ఎండోమెంట్ ఇంచార్జ్ ఎస్ఈ రామారావు రూ. 1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ACB Raid

విధాత : ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట దేవస్థానం ఎండోమెంట్ ఇంచార్జ్ ఎస్ఈ రామారావు రూ.1లక్ష 90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రామారావు వారం రోజుల క్రితమే యాదగిరిగుట్ట దేవాదాయశాఖ ఇంచార్జీ ఎస్ఈగా బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. లడ్డు కౌంటర్ల టెండర్ ద్వారా మిషినరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ కు బిల్లు చెల్లించేందుకు రామారావు లంచం డిమాండ్ చేశాడు.

మిషన్ ఖరీదు రూ.11,50,000లు కాగా..ఈ మిషనరీ బిల్లు ఇప్పిచేందుకు రామారావు 20శాతం కమిషన్ కావాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం మేరకు లంచం తీసుకుంటుండగా రామారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎల్బీ నగర్ లోని రామారావు నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు విలువైన డాక్యుమెంట్లను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.