Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంఆ 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఆ జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్ నగర్, బేగంపేట్ ఏరియాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెదక్‌లో 41.6 డిగ్రీలు, రామగుండంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 48 గంటల పాటు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందన్నారు.
