విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ రోజులను కుదించడం సరికాదని, సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని, ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ప్రతిపక్షాల దాడి నుంచి తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తున్నారని ఆరోపించారు. డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే చర్చ పెట్టడం దారుణమన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని నిలదీశారు. మూడు, నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమన్నారు. మేం 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లామని, అందులో ఒకటి, రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, సాగు నీరు, ఉద్యోగాల ఖాళీలు, విద్యా రంగ సమస్యలు, ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తున్నదని విమర్శించారు.
Eleti Maheshwar Reddy | అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్‌రెడ్డికి జంకు … బీజేఎల్పీ నేత ఏలేటి ఫైర్
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ రోజులను కుదించడం సరికాదని, సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని, ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు