Lok Sabha elections | మైనార్టీ మహిళా ఓటర్లపై బీజేపీ అభ్యర్థుల అనుమానాలు

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింపుకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు సందేహాలు లేవనెత్తి ప్రిసైడింగ్ అధికారులతో

  • Publish Date - May 13, 2024 / 04:30 PM IST

ప్రిసైడింగ్ అధికారులను ప్రశ్నించిన మాధవీలత, అర్వింద్‌లు
బుర్ఘాలతో వస్తే గుర్తించేదెట్లా అని నిలదీత

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింపుకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు సందేహాలు లేవనెత్తి ప్రిసైడింగ్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్‌లో నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మహిళా ఓట‌ర్లు బుర్ఖా ధ‌రించి పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అభ్యంత‌రం తెలిపారు. అస‌లు ఓటు వేయ‌డానికి ఎవ‌రు వ‌చ్చారు..? ఎలా గుర్తిస్తారు..? అని ముస్లిం మ‌హిళా ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌పై అర‌వింద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీరు ఏం డ్యూటీ చేస్తున్నార‌ని నిల‌దీశారు. వారేదో బెదిరిస్తే మీరు అనుమ‌తిస్తారా..? అని మండిపడ్డారు. హైద‌రాబాద్ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త కూడా ముస్లిం మ‌హిళా ఓట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. బుర్ఖా ధ‌రించి పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చిన ముస్లిం మ‌హిళా ఓట‌ర్ల‌ను బుర్ఖా తీయమని అడిగి మాధ‌వీల‌త ప‌రీక్షించారు. వారి ఓట‌రు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల‌ను ప‌రిశీలించారు. ఆమె ప‌లువురు ఓట‌ర్ల ప‌ట్ల అనుమానం వ్య‌క్తం చేశారు. ఇక అక్క‌డ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగినిపై కూడా మాధ‌వీల‌త మండిప‌డ్డారు. అస‌లు ప్ర‌భుత్వం త‌ర‌పున వ‌చ్చే ఉద్యోగుల‌ను న‌మ్మ‌కూడదు అంటూ మాధ‌వీల‌త అసహనం వ్యక్తం చేశారు.

Latest News