Site icon vidhaatha

సీబీఐ టెన్షన్…కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావుల భేటీ!

KTR, KCR and Harish Rao

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావు, జి.జగదీష్ రెడ్డిలు భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ, మండలిలో కాళేశ్వరం నివేదికపై చర్చ…సీబీఐ విచారణ కోరాలన్న ప్రభుత్వం నిర్ణయం..హైకోర్టులో కాళేశ్వరం నివేదిక రద్దు కోరుతూ వేసిన పిటిషన్లు..రేపు జరుగనున్న విచారణ..వంటి అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ జరుపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును మూలపడేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ..సీబీఐ విచారణ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు, రేపు పార్టీ శ్రేణులు ఆందోళన చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Exit mobile version