Speaker vs Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. ఇక సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా బ్లాక్ డ్రెస్‌లో కనిపించారు. దీంతో హరీశ్‌రావు కలగజేసుకొని.. మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెనుకాల ఉన్న అక్కలు నిండా ముంచుతారని సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక శాసనసభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు తమతమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పీకర్ కలగజేసుకుని చైర్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఏదో సాధిద్దామంటే కుదరదు.. సభా మర్యాదలను కాపాడడంటూ హరీశ్‌రావుకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్యనే మంత్రి శ్రీధర్ బాబు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ 🙏
– అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/B4Cg6BCnC5 pic.twitter.com/p7QY7K6cvu
— BRS Party (@BRSparty) August 1, 2024