విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ అంగీకరించారు. అ టెక్ విజనరీ శంతను నారాయణ్ ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
Held a highly engaging and fruitful conversation with Shantanu Narayen, CEO, @Adobe Systems, at Palo Alto, California today.
As one of the most respected tech visionaries and leaders in Silicon Valley, USA, and an inspirational figure, meeting Shantanu Narayen is also emotional… pic.twitter.com/UMSXcNSFhq
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2024
అడోబ్ సీఈవోతో సమావేశంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని కోరగా, అందుకు శంతను నారాయణ్ సుముఖత వ్యక్తం చేశారు.