Site icon vidhaatha

లక్ష్యాన్ని సాధించటంలో నిబద్ధతతో ఒదిగి పనిచేసే వ్యక్తి రామోజీ: ఎమ్మెల్యే కూనంనేని

విధాత: అనుకున్న లక్ష్యాన్ని సాధించటంలో నిబద్ధతతో ఒదిగి పనిచేసే వ్యక్తి రామోజీ రావు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు అన్నారు. శనివారం కొండాపూర్ సి ఆర్ ఫౌండేషన్ లో సురవరం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన రామోజీరావు సంస్మరణ సభ జరిగింది.ఈ సభలో కూనంనేని మాట్లాడుతూ అక్షరాలకు నడకనేర్పి, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు గా నిలిచిన మహనీయుడు రామోజీరావు అని అన్నారు.

రామోజీ రావు ఎంతో మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారని, పరోక్షంగా లక్షల మందికి జీవిన భృతి కల్పించారన్నారు. విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిన రామోజీకి ఇవే మా ఘనమైన నివాళులు అని అన్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ,సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి, ఈటివి శ్రీరామ్,చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version