విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం ఒకవైపు రైతు రుణమాఫీ కోసం గురువారం సాయంత్రం 7వేల కోట్ల వరకు బ్యాంకర్లకు విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా రైతులను దోచుచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. వాట్సాప్‌లలో ఏపీకే ఫైల్స్ లింకు పంపుతున్న సైబర్ నేరగాళ్లు రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులు అమాయకంగా ఆ లింక్‌లు ఓపెన్ చేస్తే వారి ఖాతాల్లోని డబ్బులు మాయమయ్యే ప్రమాదముంది. దీనిపై సైబర్ సెక్యూరిటీ రైతులను హెచ్చరిస్తుంది. రైతులు అలాంటి సైబర్ మోసగాళ్లు పంపే లింక్‌ల పట్ల అప్రమ్తంగా ఉండాలని, ఎలాంటి లింక్‌లు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. లింక్‌లు ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Cyber security | రైతులపై సైబర్ నేరగాళ్ల లింక్‌ల వల .. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ సెక్యూరిటీ
