Site icon vidhaatha

Deputy CM Bhatti Vikramarka | గురుకుల భవనాల నిర్మాణాలకు డిజైన్స్‌.. స్థల సేకరణ: డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti Vikramarka |  గురుకుల పాఠశాలల (Gurukul Schools) భవనాల నిర్మాణాలకు స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ Minister Ponnam Prabhakar) తో కలిసి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్నదని తెలిపారు.

విద్యార్థులకు వసతుల కల్పనపై ఈనెల 29లోగా తనిఖీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అనేక గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవని, గదులకు డోర్లు లేవని, హాస్టల్స్‌, వంటగదులు, మరుగదొడ్లు అపరిశుభ్ర నిలయంగా మారాయని ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనని భట్టి తెలిపారు.

Exit mobile version