Greater painted-snipe | అరుదైన ఘ‌ట‌న‌.. గుడ్ల‌ను పొదుగుతున్న మ‌గ ప‌క్షి..!

Greater painted-snipe | చాలా వ‌ర‌కు ఆడ ప‌క్షులు( Female Birds ) గుడ్ల‌ను పెట్టి అవే పొదుగుతాయి. పిల్ల‌ల సంర‌క్ష‌ణ కూడా ఆడ ప‌క్షులే చూసుకుంటాయి. కానీ ఈ ప‌క్షి మాత్రం సాధార‌ణ పక్షుల‌తో పోలిస్తే భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఈ ప‌క్షుల్లో ఆడ ప‌క్షులు కేవ‌లం గుడ్లను మాత్ర‌మే పెడుతాయి.

Greater painted-snipe | చాలా వ‌ర‌కు ఆడ ప‌క్షులు( Female Birds ) గుడ్ల‌ను పెట్టి అవే పొదుగుతాయి. పిల్ల‌ల సంర‌క్ష‌ణ కూడా ఆడ ప‌క్షులే చూసుకుంటాయి. కానీ ఈ ప‌క్షి మాత్రం సాధార‌ణ పక్షుల‌తో పోలిస్తే భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఈ ప‌క్షుల్లో ఆడ ప‌క్షులు కేవ‌లం గుడ్లను మాత్ర‌మే పెడుతాయి. గుడ్ల‌ను( Eggs ) పొద‌గ‌డం మాత్రం మ‌గ ప‌క్షుల వంతు. పిల్ల‌ల‌ను సంర‌క్షించే బాధ్య‌త కూడా మ‌గ ప‌క్షినే( Male Bird ) తీసుకుంటుంది. మ‌రి ఇలాంటి అరుదైన మ‌గ ప‌క్షి పేరు ఏంటంటే.. గ్రేట‌ర్ పెయింటెడ్ స్నైప్( Greater painted-snipe ).

గ్రేట‌ర్ పెయింటెడ్ స్నైప్ ప‌క్షి రోస్ట్రాట్యుల( Rostratulidae ) కుటుంబానికి చెందింది. ఇక ఈ ప‌క్షులు గుబురుగా పెరిగిన గ‌డ్డిలో, నీటి మొక్క‌ల మ‌ధ్య సంచ‌రిస్తూ త‌మ ఆవాసాన్ని ఏర్ప‌రుచుకుంటుంది. తెల్ల‌వారుజామున‌, రాత్రి వేళ‌లో ఆహారం కోసం సంచరిస్తూ.. చురుకుగా ఉంటుంది. ప‌గ‌టిపూట మాత్రం గ‌డ్డిలో మ‌ధ్య త‌ల‌దాచుకుని హాయిగా నిద్రిస్తుంది. విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఈ ప‌క్షుల్లో మగ ప‌క్షి క‌న్నా ఆడ‌ప‌క్షి పెద్ద‌దిగా ఉంటుంది. ఇంత‌టి వైవిధ్యం ఉన్న ప‌క్షి.. మంచిర్యాల జిల్లా( Mancherial )  జ‌న్నారం స‌మీపంలోని చెక్క‌పెల్లి కుంట‌లో సంచ‌రిస్తుంది. అయితే ఈ ప‌క్షిని గ‌మ‌నించిన వ‌న్య‌ప్రాణి ప‌రిశోధ‌కుడు డాక్ట‌ర్ వెంక‌ట్ ఎనగందుల త‌న కెమెరాలో బంధించాడు.

Latest News