America | అవి కోడి గుడ్లా లేక బంగారమా.. మరి అంత రేటా
విధాత: అమెరికాలో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల వీటి ధరలు 50శాతం పెరిగాయి. ప్రస్తుతం అమెరికాలో డజన్ గుడ్లకు 6.23డాలర్ల ధర పలుకుతుంది. అక్కడ బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికి గుడ్ల సరఫరా కొరతతో ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా కోడిగుడ్ల లభ్యత భారీగా తగ్గడమే గుడ్ల కొరతకు కారణమని అంటున్నారు. ఇప్అపటికే నేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ ‘నో ఎగ్స్’ బోర్డులు దర్శనమిస్తుండటం గమనార్హం. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఒక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి.

అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగింది. దీంతో గతేడాది ఒక్క డిసెంబర్‌లోనే సుమారు 2.3కోట్ల కోళ్లను వధించినట్లు అమెరికా వ్యవసాయశాఖ గణాంకాలు పేర్కొన్నారు. ఒహాయో, మిస్సౌరీలలో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
అమెరికా లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం.. గతేడాది జనవరిలో డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లుగా ఉండగా ప్రస్తుతం 6.23డాలర్లకు చేరింది. రానున్న రోజుల్లోనూ మరింత ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టర్కీ అమెరికాకు 15,000 టన్నుల గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికి గుడ్ల కొరత మాత్రం తీరడం లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram