Murder | హైద‌రాబాద్‌లో ఘోరం.. అన్న‌ను చంపిన త‌మ్ముడు

Murder | కుటుంబ త‌గాదాలు నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకున్నాయి. ఆవేశంలో అన్న‌ను చంపాడు త‌మ్ముడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని చాద‌ర్‌ఘాట్‌లో చోటు చేసుకుంది.

  • By: raj |    telangana |    Published on : Apr 15, 2026 10:53 AM IST
Murder | హైద‌రాబాద్‌లో ఘోరం.. అన్న‌ను చంపిన త‌మ్ముడు

Murder | కుటుంబ త‌గాదాలు నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకున్నాయి. ఆవేశంలో అన్న‌ను చంపాడు త‌మ్ముడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని చాద‌ర్‌ఘాట్‌లో చోటు చేసుకుంది.

చాద‌ర్‌ఘాట్ అజంపుర ఏరియాకు చెందిన షాప్త‌న్ హుస్సేన్‌కు త‌న కుటుంబంతో గొడ‌వ‌లు ఉన్నాయి. అయితే బుధ‌వారం మ‌ళ్లీ అన్న‌ద‌మ్ముళ్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. దీంతో ఆగ్ర‌హావేశాల‌కు లోనైన త‌మ్ముడు షాప్త‌న్ హుస్సేన్.. అన్న హ‌సీం హుస్సేన్‌పై దాడి చేశాడు. ప‌దునైన ఆయుధంతో పొడిచి చంపాడు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఆధారాల‌ను సేక‌రించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స‌మాచారం. హ‌త్యకు గ‌ల కార‌ణాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు.