విధాత, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయగా, క్రస్ట్‌గేట్ల దిగువన మత్స్యకారులు చేపల వేట కోసం హడావుడి పడ్డారు. భారీ సంఖ్యలో పుట్టిలలో వచ్చిన మత్స్యకార్మికులు క్రస్టగేట్లకు దిగువన నది జలాల్లో చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. పుట్టిలతో గుంపులుగా వచ్చిన మత్స్యకార్మికులు చేపల పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గత కొన్ని రోజులుగా కృష్ణానదిలో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా తరలివచ్చిన మత్స్యకార్మికులు చేపల వేటకు పోటీ పడ్డారు. డ్యాం దిగువన నది జలాల్లో 2నుంచి 5కిలోల వరకు చేపలు దొరుకుతుండటంతో పాటు సందర్శకుల నుంచి ఆ చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో మత్స్యకార్మికులు చేపల వేట కోసం భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు.
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ చెంత చేపల వేట హడావుడి.. పుట్టిలలో మత్స్యకారుల పోటాపోటీ
