ఆ నలుగురు మళ్లీ డుమ్మా.. బీజేపీ నేతల్లో తొలగని అయోమయం

ఆ నలుగురు మళ్లీ డుమ్మా.. బీజేపీ నేతల్లో తొలగని అయోమయం

విధాత: తెలంగాణ బీజేపీ పార్టీలో అసమ్మతి నేతల వ్యవహారం ఆ పార్టీ నేతల్లో నెలకొన్న గందరగోళాన్ని కంటిన్యూ చేసున్నది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సభలకు డుమ్మా కొట్టిన మాజీ ఎంపీలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవిందర్‌రెడ్డిలు శుక్రవారం ఘట్ కేసర్‌లో జరిగిన రాష్ట్ర పధాధికారుల సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు.



తాజాగా పార్టీ ప్రకటించిన పలు కమిటీల్లో వారికి కీలక బాధ్యతలు అప్పగించినప్పటికి వారు అలకపాన్పు దిగినట్లుగా కనిపించడం లేదని కేడర్ లో చర్చ సాగుతున్నది. బీజేపీ మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ జాయింట్ కన్వీనర్‌గా విశ్వేశ్వర్‌రెడ్డిని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డిని, అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయశాంతిని నియమించారు.



కాగా.. తాను పార్టీ మారడం లేదని, బీజేపీలోనే కొనసాగుతానని రాజగోపాల్‌రెడ్డి తాజాగా లేఖను సైతం విడుదల చేసినప్పటికి పధాధికారుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదన్నది గందరగోళంగా మారింది. కొంత కాలంగా విజయశాంతి, రాజగోపాల్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌, రవిందర్‌రెడ్డిలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతున్నది. పార్టీ కీలక సమావేశాలకు కూడా వారు దూరంగా ఉంటుండంతో వారు పార్టీ మారుతాన్న ప్రచారం యధావిధిగా కొనసాగుతున్నది.