TGSRTC | తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఏసీ జనరల్‌ పాస్‌

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యం శంషాబాద్‌లో ఉన్న విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం సరికొత్త పాస్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌’. ఈ పాస్‌ రూ.5వేలకు అందుబాటులో ఉంటుంది.

  • Publish Date - July 4, 2024 / 10:25 AM IST

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యం శంషాబాద్‌లో ఉన్న విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం సరికొత్త పాస్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌’. ఈ పాస్‌ రూ.5వేలకు అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌తో ఏ బస్సులోనైనా.. సిటీ పరిధిలో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది. పుష్పక్ పాస్‌తోపాటు శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి రూట్‌పాస్‌, గ్రీన్ మెట్రో గ్రేటర్‌జోన్‌లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో రూ.1900తో నెలవారీ పాస్‌ను సైతం తీసుకువచ్చింది. ఇది సికింద్రాబాద్-పటాన్‌చెరు (219), బాచుపల్లి-వేవ్‌రాక్ వయా జేఎన్టీయూ (195), కోఠి-కొండాపూర్ (127కే) మార్గాల్లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రూట్‌పాస్ ధరలను రూ.2వేల నుంచి రూ.4వేలుగా నిర్ణయించింది.

శంషాబాద్ నుంచి రూ.2 వేలు, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్ నుంచి రూ.3 వేలు, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి రూ.4 వేలుగా పాస్‌ ధరలను నిర్ణయించింది. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనే కాకుండా ఈ–మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ సిటీ సబర్బన్ లిమిట్స్ వరకు ప్రయాణించవచ్చని టీజీఎస్‌ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మెట్రో ఏసీ లగ్జరీ బస్​పాస్​ఎయిర్ పోర్టుకు తిరిగే పుష్పక్ ఏసీ బస్సుల్లో చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఈ పాసులు గ్రేటర్ హైదరాబాద్ జోన్ లోని అన్ని బస్సు పాస్ కేంద్రాల్లో తీసుకోవచ్చని.. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటలకు కౌంటర్లు తెరిచే ఉంటాయని ఆయన వివరించారు.

Latest News