విధాత, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ కొడంగల్‌లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని కేంద్ర మంత్రి బంండి సంజయ్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుక్ను బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అక్బరుద్ధిన్‌ను కొడంగల్‌లో పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా గెలిపించుకుని, డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఎంఐఎం గోడ మీద పిల్లి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కన చేరతారన్నారు. అక్బరుద్దీన్‌ను దమ్ముంటే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దించాలని సవాల్ చేశారు. ఆ స్థానంలో అక్బరుద్ధిన్‌కు డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు. పాతబస్తీలో హిందువులు పండుగలను జరుపుకునే పరిస్తితి లేదని కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, పాతబస్తీలో కూడా గల్లీ గల్లీలో మన పండుగ జరుగుతుందన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హిందువుల పండుగలను కాపాడటం లేదన్నారు. రంజాన్ పండుగకు 33కోట్లు కేటాయించి, హైదరాబాద్‌లో బోనాల పండుగకు 20కోట్లు కేటాయించి ఆలయానికి రూ.5. లక్షలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. హిందువులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌ను గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. హిందువుల తరపున తాను పక్కా మాట్లాడుతానన్నారు. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని బండి సంజయ్ కోరారు.
Bandi Sanjay | అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తం: బండి సంజయ్
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ కొడంగల్‌లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని కేంద్ర మంత్రి బంండి సంజయ్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుక్ను బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి