విధాత : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తిIndira Mahila Shakti పేరిట చీరలSaree పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి విడతగా గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం (డిసెంబరు 9) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. తెల్లరేషన్ కార్డు కుటుంబంలోని 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఆధార్‌తో ఇంటింటికీ చీరలు అందజేస్తున్నారు. రెండో దశలో మున్సిపాల్టీలలో 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు.
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని..వారే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి(Narayankhed MLA Sanjeeva Reddy) సతీమణి అనుపమ రెడ్డి(Anupama Reddy) ఇందిరమ్మ చీర ధరించి సందడి చేశారు. ఈ సందర్బంగా అనుపుమరెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళా ఇందిరాశక్తి చీరలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యమైన చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు సారేగా అందించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి మహిళల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు గౌరవంతోపాటు, సంప్రదాయాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుండటం అభినందనీయమన్నారు.
