MLA Sanjay Kumar : జగిత్యాల ఎమ్మెల్యే ఓ యూజ్ లెస్ ఫెలో

జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరు సంజయ్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల్లో ఆసక్తి లేదని ఆరోపించారు.

విధాత : జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరు సంజయ్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్ర విమర్శలు సంధించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఓ యూజ్ లెస్ ఫెలో..అతనికి కామన్ సెన్స్ లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్ ఆయ్యారు. అసలు ఏ పార్టీనో తెలియని ఆయన మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని..దమ్ముంటే రాజీనామా చేయ్.. నేను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాలలో నీపై పోటీ చేస్తానంటూ కల్వకుంట్ల సంజయ్ సవాల్ చేశారు. కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్ష నీ జగిత్యాల ఎమ్మెల్యే పదవి అని, నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావని కల్వకుంట్ల విమర్శించారు. జగిత్యాల జిల్లా స్వప్నాన్ని కేసీఆర్ నెరవేర్చారన్నారు. కేసీఆర్ ను, జగిత్యాల ప్రజలను మోసం చేసి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరావని ఆరోపించారు.

జగిత్యాల జిల్లా ప్రజలకు, విద్యార్థులకు కీలకమైనటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు రెండేళ్లుగా నత్తనడకన నడుస్తుంటే ఏం చేస్తున్నావు..? అని ప్రశ్నించారు. జిల్లా, నియోజకవర్గ సమస్యలపై ఏనాడు జగిత్యాల ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రశ్నించలేదని కల్వకుంట్ల విమర్శించారు. కాంట్రాక్టులు, బిల్లులు తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. కోరుట్ల పేషంట్లు జగిత్యాలకు వస్తున్నారంటూ మాట్లాడుతున్నాడని..నీ నడుం నొప్పికి ఎందుకు హైదరాబాద్ వెలుతున్నావని ప్రశ్నించారు. రేపు పొద్దున జగిత్యాల కలెక్టరేట్ కు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ అని అందరు వస్తారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రారంభించిన జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల కోసం తాను జగిత్యాలకు వచ్చానన్నారు. అంతమాత్రాన జగిత్యాలకు ఎందుకొచ్చాంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మాకునూరు సంజయ్ మాటలు చూస్తుంటే ఆయన రాజకీయ అభద్రతను చాటుతున్నాయని కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి :

Konda Surekha : వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ..మంత్రి కొండా హాట్ కామెంట్స్

YS Sharmila| ఉపాధి పథకం పేరుమార్పు దేశ ద్రోహమే : వైఎస్.షర్మిల

Latest News