Site icon vidhaatha

Telangana Journalists | జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త‌.. ప‌ద‌హారేండ్ల‌ క‌ల సాకారం..

Telangana Journalists | హైద‌రాబాద్ : ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థ‌లాల కోసం పోరాడుతున్న జేఎన్‌జే హెచ్ఎస్ జ‌ర్న‌లిస్టుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఎట్ట‌కేల‌కు పేట్ బ‌షీరాబాద్ స్థ‌లాన్ని జేఎన్‌జే సొసైటీకి అప్ప‌గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. దీంతో జ‌ర్న‌లిస్టుల ప‌ద‌హారేండ్ల క‌ల సాకార‌మైంది.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జేఎన్‌జే బీవోడీ స‌భ్యులు గురువారం స‌చివాల‌యంలో క‌లిశారు. అదే స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీనివాస్ రెడ్డి స‌మావేశ‌మై జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్థ‌లాల‌పై చ‌ర్చించారు. త‌క్ష‌ణ‌మే సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. ఈ నెల 27 లేదా 28వ తేదీన జేఎన్‌జే సొసైటీ స‌భ్యులంద‌రితో స‌మావేశం ఏర్పాటు చేసి స్థ‌ల స్వాధీన ప‌త్రాన్ని అంద‌జేస్తామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఈ సమావేశానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి సభ్యులంతా తమ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రావాల‌ని జేఎన్‌జే బీవోడీ స‌భ్యులు విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశం వివ‌రాల‌ను శుక్ర‌వారం ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. మంత్రి పొంగులేటిని క‌లిసిన వారిలో కిరణ్ కుమార్ బొమ్మగాని, ఆర్. రవికాంత్ రెడ్డి, ఎన్. వంశీ శ్రీనివాస్, పి. వి. రమణా రావు, కె.అశోక్ రెడ్డి ఉన్నారు.

Exit mobile version