విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేసిన రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై మే28న విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించింది. మహిళను అందులో తాను శాసనమండలి సభ్యురాలిగా ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా కవిత బెయిల్ ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మూడున్నర నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత వేసిన రెండు బెయిల్ పిటీషన్లను హైకోర్టు తిరస్కరించింది. కవిత ఓ ప్రముఖ వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ నుంచి కీలక నిందితురాలిగా ఉన్నారని దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది.
కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు … బెయిల్ పిటిషన్ కొట్టివేత
బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేసిన రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది

Latest News
18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు