Komatireddy Venkati reddy | విధాత : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వైరల్ గా మారింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్(Karunakar) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ మాజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన కరుణాకర్ తన ఉద్యోగం పోవడానికి మంత్రి అనుచరుల ఒత్తిడినే కారణమని ఆరోపించారు. ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన పట్టణంలో మంత్రి అనుచరుల వ్యవహరశైలీని ప్రశ్నార్ధకం చేసింది.