విధాత: హుజూరాబాద్ ఉపఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫోన్‌లో సంభాషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఠాగూర్‌కు రాజనర్సింహ వివరించారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తనకు చెప్పాలని దామోదరకు ఠాగూర్ చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వారీగా ఇంచార్జీలను పీసీసీ నియమించిన విషయం తెలిసిందే.