విధాత, వరంగల్ ప్రతినిధి:ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు. బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి- రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా రెండవ కుమారుడైన అశోక్ స్థానికంగా 7వ తరగతి చదువుకున్నాడు. మొదట డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసి అశోక్ కొంతకాలం తర్వాత జనశక్తి పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసిన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ లోకి చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అశోక్ తల్లి 20 సంవత్సరాల క్రితం చనిపోగా, తండ్రి గత సంవత్సరం మృతి చెందారు. అశోక్ కు ఇద్దరితో వివాహాలు కాగా ప్రస్తుతం వారు విడిపోయి వేరే ఉంటున్నారు. కాగా అశోక్ తండ్రి సంవత్సరికం రోజునే మావోయిస్టు నేతగా ఎదిగిన అశోక్ మృతి చెందడంతో బుద్దారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Encounter | ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ మావోయిస్టు మృతి … బుద్ధారం లో విషాదం
ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు

Latest News
భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !