Mega Job Mela | హైదరాబాద్ : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. మీకు ప్రభుత్వ కొలువు రావడం లేదా..? ఉద్యోగం లేక బాధపడుతున్నారా..? అయితే చింతించాల్సిన అవసరమే లేదు. మీ లాంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం జూన్ 1న మెగా జాబ్ మేళాకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.
జాబ్ మేళా వేదిక ఎక్కడంటే..?
మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 67 వద్ద ఉన్న కింగ్స్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మరి ఎన్ని గంటలకు..?
సోమవారం రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది.
అర్హత ఏంటి..?
పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. జాబ్ మేళాకు వచ్చే ప్రతి అభ్యర్థి ఒరిజినల్ ధృవపత్రాలతో రావాల్సి ఉంటుంది.
ఈ కంపెనీల్లోనే ఉద్యోగాలు
ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్. వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా కలదు.
తదితర వివరాల కోసం ఈ నంబర్‌ను సంప్రదించొచ్చు.. 8374315052
