ఎల్‌ఐసీకి నూత‌న ఎండీగా మినీ ఇపే

విధాత,హైదరాబాద్‌: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మినీ ఇపే సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. గత నెల 5న మినీ ఇపేను ఎల్‌ఐసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న మినీ 1986లో ఎల్‌ఐసీలో డైరెక్ట్‌ రిక్రూట్‌ ఆఫీసర్‌గా చేరారు. ఎల్‌ఐసీలోని వివిధ విభాగాల్లో ఈమె పనిచేశారు. ఎండీగా బాధ్యతలు చేపట్టేంత వరకు మినీ.. ఎల్‌ఐసీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ […]

  • Publish Date - August 3, 2021 / 09:34 AM IST

విధాత,హైదరాబాద్‌: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మినీ ఇపే సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. గత నెల 5న మినీ ఇపేను ఎల్‌ఐసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న మినీ 1986లో ఎల్‌ఐసీలో డైరెక్ట్‌ రిక్రూట్‌ ఆఫీసర్‌గా చేరారు. ఎల్‌ఐసీలోని వివిధ విభాగాల్లో ఈమె పనిచేశారు.

ఎండీగా బాధ్యతలు చేపట్టేంత వరకు మినీ.. ఎల్‌ఐసీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఎల్‌ఐసీ తొలి మహిళా జోనల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి)గా మినీ ఇపే.. ఎస్‌సీజెడ్‌ఓ, హైదరాబాద్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించటం విశేషం. ఎల్‌ఐసీహెచ్‌ఎ్‌ఫఎల్‌ పైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌), డైరెక్టర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఎల్‌ఐసీహెచ్‌ఎ్‌ఫఎల్‌ వ్యాపారాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చారు.

Latest News