Site icon vidhaatha

Minister Konda Surekha | దేవాలయాల భూములకు జియో ట్యాగింగ్‌: మంత్రి కొండా సురేఖ

విధాత, హైదరాబాద్ : దేవాదాయశాఖ ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ అమలు చేయనున్నట్లుగా మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. హైదరాబాద్ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ దేవాలయ భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆధునిక పద్ధుతుల్లో భూ రికార్డులు నమోదు చేయడం ద్వారా అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీయనున్నట్లు తెలిపారు. ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. సమీక్షలో దేవాలయాల భూముల వివరాలతో పాటు ఆలయాల ఆర్థిక, నిర్వాహణ పరిస్థితులు, పాలక మండళ్ల ఖాళీలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, కమిషనర్లు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version