Site icon vidhaatha

Minister Ponguleti Srinivas Reddy | కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్

నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లుగా నిరూపించాలని సవాల్‌
రేవంత్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌లో జన్వాడ ఫామ్‌హౌజ్ కేటీఆర్‌దన్నారు
ఇప్పుడు నా ఫ్రెండ్ వద్ధ లీజు తీసుకున్నాడని బుకాయిస్తున్నాడని ఎద్దేవా

Minister Ponguleti Srinivas Reddy | ఆక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా (HYDRA) ముందుగా బఫర్ జోన్‌లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు.. కేటీఆర్, హరీశ్‌రావు నిరూపించాలని సవాల్ విసిరారు. అలాగే ఎఫ్‌టీఎల్‌ బఫర్ జోన్ లో నాకు సంబంధించి ఒక్క ఇటుక ఉన్నా కొత్త టేప్ పెట్టి కొలిచి కూల గొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చెబుతున్నానన్నారు. నేను అధికారంలో ఉన్నందునా అధికారులపై నమ్మకం లేకపోతే మీరే వెళ్లి కొలిచి నిర్ణయించాలని కేటీఆర్‌, హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఈ పొంగులేటి ఎప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులతో విమర్శలు పడే చాన్స్ ఇవ్వడన్నారు. మీ ప్రతిపక్ష హోదాను, పార్టీని కాపాడుకునేందుకు రెవెన్యూ మంత్రిగా ఉన్న నాపై అక్రమాల పేరుతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మీలాగా మీరు నివసించే ఇల్లు నాది కాదని చెప్పనని పొంగులేటి తప్పుబట్టారు. జన్వాడ ఫామ్ హౌజ్ (Janwada Frame House) నా ఫ్రెండ్‌కు చెందినదని, నేను లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ చెబుతున్నాడని, అలాంటప్పుడు జన్వాడా ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌లు ఎగురవేశారని రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టారని, ఆ ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్ ఇంటిపైనే అక్రమంగా డ్రోన్‌లు ఎగరేశారని ఎందుకు పేర్కోన్నారని పొంగులేటి నిలదీశారు. నీలాగా నేను బుకాయించానని, నేను ఉంటున్న ఇల్లు ప్రస్తుతం నా కొడుకు పేరుతో ఉందని, ఐనప్పటికి మీలాగా నేను తప్పించుకోనని, అది నా ఇల్లుగానే చెబుతానన్నారు. సామాన్యుల మేలు కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. గడిచిన పదేళ్లలో కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా బఫర్ జోన్‌లలో బీఆరెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆక్రమ కట్టడాలు కట్టారన్నారు. అవన్ని సక్రమమైతే హైడ్రాను చూస్తే వారికి ఎందుకు భయమన్నారు. హైడ్రాపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కోర్టు కూడా స్వాగతించిందని గుర్తు చేశారు.

Exit mobile version