Site icon vidhaatha

Nalgonda : ఏసీబీకి చిక్కిన నల్లగొండ మత్స్యశాఖ అధికారిణి

Fisheries Officer Bribe In Nalgonda

విధాత, నల్లగొండ: నల్లగొండ(Nalgonda) జిల్లా మత్స్యశాఖ అధికారిణి(Fisheries Officer) చరితారెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కారు. మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం ఆమె బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధితుడి నుంచి రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ చరిత రెడ్డి(Charitha Reddy ) ఏసీబీకి చిక్కింది. ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Exit mobile version