ప్రతీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందీ
అర్హులందరికీ సంక్షేమ పథకాలే లక్ష్యం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
విధాత ప్రత్యేక ప్రతినిధి:స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఇదే క్రమశిక్షణతో పని చేయాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరికీ సముచిత స్థానం దక్కుతుందనీ అన్నారు. దీని కోసం కార్యకర్తలు ఓపికగా ఉండాలని సూచించారు. మడికొండలో బుధవారం జరిగిన స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిష్పాక్షపాతంగా, అవినీతి రహితంగా అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందించాలన్నారు. దీనికోసం సమన్వయంతో పని చేయాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. డాక్టర్ కడియం కావ్య గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.తండ్రి కడియం శ్రీహరికి తగ్గ తనయగా కడియం కావ్య పేరు తెచ్చుకోవాలని సూచించారు. రాబోయే రోజులల్లో మంచి రాజకీయ భవిష్యత్ ఉందన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను సమ దృష్టితో చూడాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అభివృద్ధిలో అగ్రగామిగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఉండాలని కోరారు. నా నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేవని చెప్పారు. ఎవరైనా గ్రూపులని తిరిగితే తోకలు కత్తిరించడం ఖాయమని, పనిలో పోటీ పడుదామని, కూర్చునే సీటులో కాదన్నారు. దేవాదుల ప్రాజెక్టుతో నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి సాగు నీరు అందించే బాధ్యత నాదన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విద్యా, వైద్యంలో చాలా వెనక బడి ఉన్నాం దానిని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ నాకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికీ వారే అభ్యర్థిగా భావించి నా కోసం కష్ట పడ్డారన్నారు. ఎంపీ ఎన్నికలతో అయిపోలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురావేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆపేక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, మేయర్ గుండు సుధారాణి, డీసిసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఐత ప్రకాష్ రెడ్డి, ఆయిల్ సిడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, ఏఐసిసి నాయకులు, జిల్లా నాయకులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.