Site icon vidhaatha

ఢిల్లీ కాంగ్రెస్‌ రూమ్‌ ఎదుట ఓయు విద్యార్థుల నిరసన

విధాత : కాంగ్రెస్‌ టికెట్టు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీలో తమ ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఆదివారం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ అత్యవసర భేటీ కాగా, ఆశావహులు ఢిల్లీకి చేరుకుని టికెట్ల కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు.


మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఢిల్లీలోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశమైంది. రాహుల్‌గాంధీ సూఛనలను స్క్రీనింగ్‌ కమిటీ పరిగణలోకి తీసుకని ఎన్నికల్లో యువతకు సీట్లు కేటాయించాలని ఫ్లకార్డ్సు పట్టుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులకు, ఓయు విద్యార్థి సంఘం నేతలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version