Site icon vidhaatha

పురివిప్పిన మయూరం.. మైమరచిన జనం (వీడియో)

విధాత: ఆరోగ్యం కోసం నిత్యం నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ కు వచ్చే వాకర్లకు అక్కడి పచ్చదనంతో పాటు చెంతనే స్వేచ్ఛగా తిరిగే మయూరాలు కట్టి పడేస్తున్నాయి.

తాజాగా ఓ మయూరం పురివిప్పి తనదైన నృత్యంతో అందరిని కట్టిపడేసింది. వాకింగ్ కు వచ్చిన వారంతా ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తూ మైమరచిపోయారు.

అక్కడే ఉన్న ఓ నెటిజన్ తన ఫొన్ లో నెమలి నృత్యాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. తాజా సర్వే ప్రకారం ఈ పార్క్‌లో దాదాపు 512 నెమళ్లు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

Exit mobile version