Site icon vidhaatha

grade separators । రూపురేఖలు మారిపోనున్న కేబీఆర్‌ పార్క్‌ పరిసరాలు.. గ్రేడ్‌ సపరేటర్ల నమూనాలు విడుదల

grade separators । కేబీఆర్‌ పార్కు చుట్టూ నిత్యం కొనసాగే ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు ప్రాంతాల్లో గ్రేడ్‌ సపరేటర్లు ఏర్పాటు చేయనున్నది. హెచ్‌సిటీ ప్రాజెక్టు పేరుతో రోడ్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తున్నది. దీనిలో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపట్టే ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం 826 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉన్న రోడ్లు నగర ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే క్రమంలో కీలకంగా ఉన్నాయి. ఇక్కడ నిత్యం భారీ ట్రాఫిక్‌ ఉంటుంది.  పార్క్‌ చుట్టూ ఆరు ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కమర్షియల్‌ ప్రయాణాలతో ఇవి నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్న మాధాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు నిత్యం వేల వాహనాలు వెళుతుంటాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లను నివారించేందుకు ప్రస్తుతం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, యూటర్న్‌లు ఏర్పాటు చేశారు.

ఈ జంక్షన్ల ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్క్‌ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్ల వద్ద రెండు ప్యాకేజీలతో 826 కోట్లతో గ్రేడ్‌ సపరేటర్లకు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో పార్క్‌ చుట్టూ ఉండే రోడ్లన్నీ సిగ్నల్‌ ఫ్రీగా తయారవుతాయి. ట్రాఫిక్‌కు కూడా ఎలాంటి అంతరాయాలు ఉండబోవు. క్లాక్‌వైజ్‌లో కదిలే ట్రాఫిక్‌ పలు అండర్‌పాస్‌ల గుండా వెళ్లేటట్టు, కౌంటర్‌ క్లాక్‌వైజ్‌లో కదిలే వాహనాలు ఫ్లైవోవర్ల మీదుగా వెళ్లేటట్టు డిజైన్‌ చేస్తున్నారు. వర్షాకాలంలో అండర్‌పాస్‌లలో నీళ్లు నిలువకుండా డిజైన్‌లను రూపొందిస్తున్నారు.

ఇవీ వివరాలు..

Exit mobile version