Site icon vidhaatha

నీకు నీ బాస్‌కు అడ్ర‌స్ లేకుండా చేస్తాం, ఖ‌బ‌డ్దార్

మాజీ మంత్రికి ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి వార్నింగ్‌

విధాత‌: నీకు నీ బాస్‌కు అడ్ర‌స్ లేకుండా చేస్తాం, ఖ‌బ‌డ్దార్ అంటూ మాజీ మంత్రి, సూర్య‌పేట ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి. పది సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ నువ్వు దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తామ‌ని, కిరాయి ఇంట్లో డొక్కు స్కూటర్ పైన తిరిగే నీకు వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఆదివారం భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఉద్యమ కాలంలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మీరు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మ‌రో 20 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటుంద‌న్నారు. మ‌నంద‌రి ఆశాకిరణం యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. ప్ర‌ధాని మోదీ వ‌చ్చిన కిర‌ణ్ కుమార్‌రెడ్డి గెలుపు ఆప‌లేర‌న్నారు. చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి ఒక్కడు కాదు ఆయన వెనక దామోదర్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఈనెల 21న పెద్ద ఎత్తున భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు, కావున తుంగతుర్తి ప్రాంతం నుండి 50 వేల మంది తరలి రావాల‌ని రాజ‌గోపాల్‌రెడ్డి పిలుపినిచ్చారు.

Exit mobile version