విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు. కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్‌భు స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు సోనియాగాంధీ ప్రత్యేక అతిధిగా హాజరుకాబోతుండటం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు.

Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు