Site icon vidhaatha

మేయర్ గద్వాల ఇంట్లో రౌడీ షీటర్ హల్‌చల్‌

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో రౌడీ షీటర్ హల్‌చల్ సృష్టించాడు. యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్‌ ఏకంగా మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె గదిలోకి వెలుతున్న క్రమంలో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. తనకున్న సమస్యలపై విజయలక్ష్మితో మాట్లాడేందుకు వచ్చానని, ఆమెను పిలవండంటూ లక్ష్మణ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో లేరు. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో ఆమె ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తుంది. మేయర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రౌడీ షీటర్ లక్ష్మణ్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version