Site icon vidhaatha

South Central Railway | రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ మూడు రైలు సమయాలు మారాయి..!

South Central Railway | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అలెర్ట్‌ జారీ చేసింది. దక్షిణ మధ్య పరిధిలో నడుస్తున్న మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది. లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (Narayanadri Express), సికింద్రాబాద్‌ – తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (Padmavathi SF Express), సికింద్రాబాద్‌ – గూడూర్‌ సింహపురి ఎక్స్‌ప్రెస్‌ (Simhapuri SF Express) రైలు వేళల్లో మార్పులు జరిగాయని తెలిపింది. లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12734) రైలు లింగంపల్లిలో సాయత్రం 5.30 గంటలకు బయలుదేరనున్నది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు సాయంత్రం 6.05 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి నడికుడికి రాత్రి 8.34 గంటలకు, పిడుగురాళ్లకు రాత్రి 8.54 గంట‌లకు, స‌త్తెన‌ప‌ల్లికి 9.22 గంట‌ల‌కు, గుంటూరుకు రాత్రి 10.55 గంట‌ల‌కు చేరుతుంది.

ఇక తెనాలికి రాత్రి 11.38 గంట‌ల‌కు చేరుకోనుండగా.. బాపట్లకు అర్ధరాత్రి 12.14 గంట‌ల‌కు చేరనున్నది. చీరాలకు 12.29 గంట‌ల‌కు, ఒంగోలుకు అర్ధరాత్రి 1.13 గంట‌ల‌కు, సింగ‌రాయ‌కొండకు 1.34 గంట‌ల‌కు, కావ‌లికి 2.04 గంట‌ల‌కు, నెల్లూరుకు 2.28 గంట‌ల‌కు, గూడురుకు తెల్లవారుజామున 3.34 గంట‌ల‌కు, వెంక‌ట‌గిరికి తెల్లవారుజామున 4.18 గంట‌ల‌కు, శ్రీ‌కాళ‌హ‌స్తికి 4.38 గంట‌ల‌కు, రేణిగుంటకు 5.08 గంట‌ల‌కు, తిరుప‌తి స్టేష‌న్‌కు ఉదయం 5.55 గంటలకు చేరనున్నది. అలాగే, సికింద్రాబాద్‌ – తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (12764) రైలు పలు స్టేషన్ల మధ్య సమయాల్లో మార్పులు చేసింది. సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది.

ఇక గూడురు స్టేషన్‌కు ఉదయం 4.19 గంట‌ల‌కు.. వెంక‌ట‌గిరికి 5.09 గంట‌ల‌కు, శ్రీ‌కాళ‌హ‌స్తికి 5.29 గంట‌ల‌కు చేరనున్నది. రేణిగుంటకు 5.58గంటలకు, తిరుపతి స్టేషన్‌కు 6.55 గంటలకు చేరుతుందని తెలిపింది. సికింద్రాబాద్‌ – గూడూర్‌ స్టేషన్ల మధ్య ఎలాంటి మార్పులు ఉండవని చెప్పింది. సికింద్రాబాద్‌ – గూడురు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ (12710) రైలు ప్రయాణంలోనూ మార్పులు చేసింది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 10.30గంటలకు బయలుదేరి.. తెల్లవారు జామున 3.35 గంటలకు విజయవాడ చేరుతుంది. తెనాలికి 4.19 గంట‌ల‌కు, బాప‌ట్లకు 4.59 గంట‌ల‌కు, చీరాలకు 5.19 గంట‌ల‌కు, ఒంగోలుకు 5.58 గంట‌ల‌కు, సింగ‌రాయ‌కొండకు 6.19 గంట‌ల‌కు వస్తుంది. కావ‌లి స్టేష‌న్‌కు 6.59 గంట‌ల‌కు, బిట్రగుంట స్టేష‌న్‌కు 7.19 గంట‌ల‌కు, నెల్లూరుకు 7.58 గంట‌ల‌కు, వేద‌య‌పాలెం స్టేష‌న్‌కు 8.05 గంట‌ల‌కు, గూడురు స్టేష‌న్‌కు ఉద‌యం 8.55 గంట‌ల‌కు చేరుతుందని వివరించింది. ప్రయాణికులు ఆయా రైళ్ల సమయాల్లో మార్పులను గమనించి.. సహకరించాలని కోరింది.

Exit mobile version