మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు.!

SSC ఫలితాలు 2026 మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం. మూల్యాంకనం చివరి దశలో ఉండగా, 5.16 లక్షల విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Telangana SSC students checking their results on notice board

ఫలితాల బోర్డు ముందు విద్యార్థులు.. ఉత్కంఠ క్షణాలు…

 SSC 2026 Results Update: Telangana Likely to Announce in First Week of May

విధాత సిటీ బ్యూరో | 13 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Telangana SSC 2026 Results: తెలంగాణలో 10వ తరగతి (SSC) పరీక్షలు ముగిసిన నేపథ్యంలో, విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాలపై కీలక అప్డేట్ వెలువడింది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (DGE) ప్రకారం, పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తికాగా, మిగతా ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి.

మూల్యాంకనం దాదాపు పూర్తిసాంఘిక శాస్త్రం ఆఖరున

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం వంటి ప్రధాన సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం మూల్యాంకనం ఏప్రిల్ 16లోపు పూర్తి కానుంది. అయితే, చివరి పరీక్షగా జరిగిన సాంఘికశాస్త్రం పేపర్ మూల్యాంకనం మాత్రం ఏప్రిల్ 17 నుంచి 23 వరకు జరుగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటనకు సిద్ధం అవుతారు.

ప్రభుత్వ పరీక్షల అధికారులు చెబుతున్నదేమిటంటే,  షెడ్యూల్ ప్రకారం అన్నీ పూర్తయితే, మే మొదటి వారంలోనే ఫలితాలు విడుదల అవుతాయి

5 లక్షల మందికి పైగా హాజరుభారీ స్థాయిలో పరీక్షలు

ఈసారి SSC పరీక్షలకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు.

ఇక OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I మరియు వొకేషనల్ కోర్సు పరీక్షలు ఏప్రిల్ 15, పేపర్-II ఏప్రిల్ 16న జరగనున్నాయి.

మొత్తం మీద చూస్తే, ఈసారి SSC ఫలితాలు ఆలస్యం కాకుండా త్వరగా రావడానికి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు మే మొదటి వారం కోసం సిద్ధంగా ఉండాలి.

Latest News