12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఈ నెల 12న ఆదివారం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

Reported by: Y.V. Narsimha Reddy | వార్త‌లు | Apr 10, 2026, 4:47 pm IST
Read Time: 2 mins
12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 12న ఆదివారం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన వార్షిక పరీక్షలకు సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

పది ఫలితాలు కూడా

ఇంటర్ ఫలితాల అనంతరం పదో తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల (ఏప్రిల్‌) 1న ప్రారంభం కాగా, 23తో ముగియనుంది. పేపర్ వాల్యూయేషన్ పూర్తయిన తర్వాత నమోదు ప్రక్రియ ఉంటుంది. దీని ప్రకారం ఏప్రిల్‌ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టెన్త్‌ 2026 పరీక్షలు మార్చి 14న మొదలు కాగా, ఏప్రిల్‌ 16తో ముగియనున్నాయి.