తెలంగాణ ఉద్యమ కారుల కుటుంబాలను ఆదుకుంటాం రాష్ట్ర మంత్రులు ..సీతక్క,పొన్నం ప్రభాకర్

రంగల్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ కారులను, అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు.

  • Publish Date - June 3, 2024 / 07:45 PM IST

ఘనంగా తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

విధాత, వరంగల్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ కారులను, అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులకు ఏర్పాటు చేసిన సన్మాన సభకు మంత్రులు , ధనసరి సీతక్క,పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల వారికి సన్మానం చేయడంతో పాటు 1969 తొలి దశ, మలి దశ ఉద్యమ కారులను నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, టిపిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టిపిసిసి నాయకులు, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్,సీతారాం నాయక్,పసునూరి దయాకర్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, పాలకుర్తి శాసనసభ సభ్యురాలు యశస్విని రెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎంతో మంది అమరవీరుల త్యాగాల ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రంఅని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారమే లక్ష్యంగా తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణార్పణ చేసిన అమరవీరులు తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని అన్నారు.ఉద్యమ సమయంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఉద్యమ కారులకు ఇంటి స్థలం, పించను అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్, కాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ ,ప్రొఫెసర్ టి. పాపి రెడ్డి, సయ్యద్ వలీ ఉల్లాఖాద్రి, రహీమున్నీసా బేగం, ప్రోపేసర్ కూరపాటి వెంకటనారాయణ, శోభారాణి, జనార్ధన్, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు మేధావంతులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News