Site icon vidhaatha

రాంచీలో ఓటేసిన తెలంగాణ ఇంచార్జి గవర్నర్‌

విధాత: జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ క్యూలైన్‌లో వ‌చ్చి ఓటు వేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ తాను ఓటు వేసి ప్ర‌జాస్వామ్య హ‌క్కును వినియోగించుకున్నానని తెలిపారు. ప్ర‌తి పౌరుడు కూడా విధిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, దేశానికి ప్రజాస్వామ్య కర్తవ్యం కూడా అని రాధాకృష్ణ‌న్ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జార్ఖండ్‌లోని 4 లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. 543లోక్‌సభ స్థానాలకు గాను ఆరో విడత పోలింగ్‌తో 486స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది.

Exit mobile version