విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో కొత్త బీర్లు రాబోతున్నాయి. రాష్ట్రంలో తమ బీరు బ్రాండ్‌లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందింది. ఇక పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల బీర్ల కొరత నెలకొన్న నేపథ్యంలో కొత్త బ్రాండు బీర్లకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో కొంత బీర్ల కొరత తీరబోతుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతుల ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.
Beer | రాష్ట్రంలో సోమ్ డిస్టలరీస్ బీర్లకు అనుమతి
