హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని, రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారు. వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో ఏపీకి వెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1369 మంది ఉద్యోగులు తమతంట తాముగా సమ్మతి తెలిపారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1369 మంది శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఏపీకి పంపించాలని అభ్యర్థనను అందించారు. 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యోగుల వివరాలను సేకరించింది. వీరి అభ్యర్థన మేరకు ఏపీకి పంపించేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని నో ఆబ్జక్షన్ తెలియజేస్తూ 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
కొలిక్కి వచ్చిన ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ.. కొత్త నిర్ణయాలేమీ లేవన్న అధికారులు
తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని, రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి.

Latest News
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్‌గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో