• Telugu News
  • /Andhra pradesh

CM CHANDRABABU | ఫార్మా కంపనీ బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

Reported by: Subbu | ఆంధ్ర ప్రదేశ్ | Aug 22, 2024, 2:10 pm IST
Read Time: 3 mins
CM CHANDRABABU | ఫార్మా కంపనీ బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

మృతులకు కోటి పరిహారం..క్షతగాత్రులకు 50లక్షలు

విధాత, హైదరాబాద్ : విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి వారు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి వెలుపల సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేస్తామని, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, దాని పర్యవసానమే ఈ ప్రమాదమన్నారు.