HMWSSB | హైదరాబాదీలకు అలర్ట్.. మే 2న తాగునీటి సరఫరా బంద్..!
HMWSSB | హైదరాబాదీలకు ముఖ్య గమనిక. మే 2వ తేదీన హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జల మండలి అధికారులు ప్రకటించారు.
HMWSSB | హైదరాబాదీలకు ముఖ్య గమనిక. మే 2వ తేదీన హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జల మండలి అధికారులు ప్రకటించారు. 2వ తేదీ ఉదయం 6 నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు. ఈ క్రమంలో ప్రజలు నీటిని విచ్చలవిడిగా ఉపయోగించకుండా, చూసి వాడుకోవాలని సూచించారు.
ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ వద్ద ఉన్న 1.36 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంకు శుభ్రపరిచే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.
ప్రభావితమయ్యే ప్రాంతాలివే..
రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడెకి కబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సచివాలయం, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, గన్‌ఫౌండ్రీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్ నగర్, కవాడిగూడ, గాంధీ నగర్, దోమలగూడ, బంజారాహిల్స్ జీహెచ్ఎంసీ వార్డ్స్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram